Spiritual

Kanakadhaara Stotram

This is a telugu version of Kanakadhaara Stotram (original work by Adi Shankaracharya in Sanskrit

This is not a literal translation but similar work to the great masterpiece

కనక ధారా స్తోత్రం

మొగ్గల నిండిన నల్ల కానుగను

ప్రెమతో తుమ్మెదలు చేరునట్లు

వెన్నుని యురమున గల శ్రీ మహాలక్ష్మి

చూపుల పులకింతలతో శుభముల

   ఆ మందల దెవి కటాక్షమొ

   మా పైని ప్రసరించి మేలు

నల్ల కలువలపై మధుపము లట్లు

వెన్నున పైకి ప్రసరించి సిగ్గున మరలు

ఆ లక్ష్మి కను చూపు నా పైకి కొంత

మరలించ జాలు – సంపదలిచ్చుగాత!

నల్ల కలువల నీల ద్యుతులను బోలి

భక్తుల క్రింద  పదవినైన నీయగ జాల

హరిప్రియ క్రీ జూపు అరక్షణమైన

నాపై నిలువ సంపదలు గల్గు నిజము

ప్రేమ మీరగ విభుని శ్రీహరిని

శ్రీ లక్ష్మి అరకనుల జూచి,

అంతలోననె మరల్చు పన్నగ సాయి

దేవేరి  దయాళులే ద్రుక్కు

ఒక క్షణము భక్తులపై వ్రాలజాలు

సకల శుభముల సంపదలనిచ్చుగాదె

నల్ల మబ్బున మెరయు మెగపుతావియై

నీల మేఘుని యురము నందమరు

జగముల జనని సొగసైన ద్రుక్కులు

సకల శుభముల నాకు పొందించుగాక!

ఏ తల్లి చూడ్కులు కౌస్థుభమునందు

ఈంద్ర నీలముల హారమై శోభించు

ఏ తల్లి ద్రుష్టి సోక విష్నుని కోర్కెలు దీర్చు

అట్టి ఆ జనని చూపు మేలొసగు గాక!

మధు  కైతభులను దునిమిన య హరి

సముద్రుని కూతురు శ్రీ మహాలక్ష్మి

చూపు సోకిన జగత్పతి కాలుడాయె

యా తల్లిక్రీ చూపు మము తిన్నగ సోకుగాక!

చాతకపక్షి కూన దప్పియను అఘము

దీయగాలి మేఘము వర్షించి తీర్చు

చిరకాల దుష్కర్మము బొగొట్టి శిశువుపై నాపై

కటాక్షము చేత దారిద్ర్యమణిచి , భాగ్యమ్మునొసగుగాక!

స్రుష్టి సమయాన సరస్వతి చేత

రక్షన లక్ష్మియై, కలె రూపిణి శాకంభరై

లయ కాలమున పార్వతిగాబరగు 

ముజ్జగములేలు విష్ణుని రాణికిజోతలు

యగ్ఞాది ఫలములిచ్చు వేద రూపిణికిని

దాక్షిణ్యాది గుణముల

సంథొష రూపికి, శతపత్ర స్థితకు

శక్తికి, విష్ణుని రాణి పుష్టిరాలక్ష్మికివే జొతలు

అంబుజము బొలు వంద వందనమ్ములు

పాల సంద్రము నందు జన్మించినది

చంద్రునకు, అమ్రుతము సోదరియైన

నారాచనుని రాణి లక్ష్మికి నమస్సులగుగాక!

బంగారము కనుల పీటిగా గల్గి

భూవలయమునకు రాణియౌ తల్లి

దేవ బ్రుందమునందు కరుణజూపేటి

శార్ఞాయుధుని రాణికి వేల నమస్సులు

భ్రుగుముని ప్రియ పుత్రిక మహాతల్లి

విష్ణునివక్షస్సుస్థిథయైన తల్లి

కమలాలయకు, దామోదర 

వల్లభకు పలికెదను నమస్సు !!

____

Published by seshu